పది కోట్ల భూమి విక్రయం: అరెస్టు
హైదరాబాద్: నకిలీ పత్రాలతో పది కోట్ల రూపాయల భూమిని అమ్మిన న్యాయవాది సుబ్బారెడ్డిని హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కడప జిల్లా పులివెందులకు చెందిన సుబ్బారెడ్డి అనే న్యాయవాది షేర్ లింగంపల్లిలో ఈ భూమిని అమ్మినట్లు పోలీసులు చెప్పారు.
నాలుగు ప్లాట్లలో అతను ఇళ్లు కట్టుకున్నాడని వారు చెప్పారు. ఇందిరాదేవి, సీతాదేవి పేర్ల మీద ఉన్న భూములను కూడా అతను విక్రయించాడని పోలీసులు చెప్పారు. అతనితో పాటు శ్రీశైలం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
