షబ్బీర్ సవాల్ కు టిడిపి సై
హైదరాబాద్: ముస్లింల కోసం చేపట్టిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని తెలుగుదేశం మైనారిటీ విభాగం అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు యూసుఫ్ అలీ చెప్పారు. ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తక్కువ, చెప్పుకుంటున్నది ఎక్కువ అని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లింలకు చేసిన మేలును సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. చర్చను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో చేపట్టినా, తమ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో చేపట్టినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
