కోల్లేరు పరిధిపై అసెంబ్లీలో వాగ్వివాదం
హైదరాబాద్: కొల్లేరు సమస్యపై గురువారం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమాధానానికి తెలుగుదేశం సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం సభ్యులు నిరసన తెలుపుతూ స్పీకర్ పోడియం వైపు రెండు మూడు సార్లు దూసుకొచ్చారు. ప్యానెల స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు. గందరగోళం మధ్యనే ముఖ్యమంత్రి తన సమాధానాన్ని పూర్తి చేశారు. అనంతరం సభ సాయంత్రం నాలుగున్నర గంటలకు వాయిదా పడింది.
కొల్లేరు సరస్సు పరిధిని తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. మూజువాణీ ఓటుతో శాసనసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.












Click it and Unblock the Notifications
