ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన: బిజెపి

వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు. బుష్ పాలనా యంత్రాంగానికి, అమెరికా కాంగ్రెస్ కు మధ్య జరిగిన సమాచార వినిమయం అణు ఒప్పందంలోని రహస్యాలను వెల్లడి చేస్తున్నాయని, వాటిని బట్టి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని తెలిసిపోతోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల అమెరికా, భారత ద్వైపాక్షిక సంబంధాలు కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. మన ప్రభుత్వం చెబుతున్నదానికి, అమెరికా పాలకులు చెబుతున్నదానికి మధ్య ఏ మాత్రం పొంతన లేదని అరుణ్ శౌరి అన్నారు. భారత్ అణు పరీక్షలు నిర్వహిస్తే ఒప్పందం రద్దవుతుందని అమెరికా స్పష్టంగా చెబుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
