హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని సంప్రదించినట్లు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధయాష్కీ చెప్పారు. తెరాసతో పొత్తుకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాస తిరిగి కాంగ్రెసుకు మిత్రపక్షమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. తెలుగదేశం, సిపిఎంల పొత్తును ప్రజలు హర్షించరని ఆయన అభిప్రాయపడ్డారు రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదని ఆయన అన్నారు.