హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెసును ఓడించడానికి తమతో కలిసి రావాలని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం ప్రజారాజ్యం నేత చిరంజీవిని కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కన్నా బలవంతుడని, బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ కలిస్తే తప్ప రాజశేఖర రెడ్డిని ఓడించలేమని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య అవగాహన కుదిరే అవకాశం ఉందని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ ఎజెండాలో పలు మంచి అంశాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసును ఓడించడానికి ప్రజారాజ్యం, నవ తెలంగాణ ప్రజా పార్టీలు ముందుకు రావాలని ఆయన అన్నారు.