చిరు పార్టీలో తమ్మినేని చేరిక
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో గురువారంనాడు లాంఛనంగా చేరారు. ఆయనను చిరంజీవి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణపై ముందుగానే నిర్ణయం తీసుకుని ఉంటే టి. దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి వెళ్లిపోయి ఉండేవారు కాదని ఆయన అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, వ్యక్తిస్వామ్యం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత కె. ఎర్రంనాయుడిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారు తెలుగుదేశం పార్టీలో ఎక్కువయ్యారని, వారిని బయటకు పంపాలని ఆయన అన్నారు. ఎర్రంనాయుడు శ్రీకాకుళం జిల్లాలో అందరినీ అణచివేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
