చిరంజీవి దత్త పుత్రిక వివాదం
హైదరాబాద్: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కత్తి పద్మారావు కుమారుడిని వివాహం చేసుకున్న తమ్మిన సుబ్బారావు, మణిల కూతురు నళిని స్పష్టం చేసింది. నళినికి, కత్తి పద్మరావు కుమారుడు చేతన్ వివాహాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జరిపించడం వివాదంగా మారింది. నళినిని దత్తత చేసుకోవడానికి చిరంజీవి ఎవరని సుబ్బారావు, మణి ప్రశ్నిస్తున్నారు. తమ కూతురిని తమకు అప్పగించకపోతే చిరంజీవి పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నళిని తన వైఖరిని వెల్లడించారు. తన ఇష్ట ప్రకాకరమే పెళ్లి చేసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ వివాదంలోనికి చిరంజీవిని లాగవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రుల వద్దకు వెళ్లే ఆలోచన తనకు లేదని ఆమె చెప్పారు. తనపై ప్రేమ ఉంటే తల్లిదండ్రులు తన వద్దకు రావచ్చునని ఆమె చెప్పారు. చిరంజీవి పార్టీ కార్యాలయం వద్ద తన తల్లిదండ్రులు ధర్నా చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తన తల్లిదండ్రుల చేత ఎవరో ఆరోపణలు చేయిస్తున్నారని ఆమె అన్నారు. పెళ్లికి ఒప్పుకోకపోతే అంతం చూస్తామని కత్తి పద్మారావు, ఆయన కుమారుడు చేతన్ తమ కూతురిని బెదిరించారని నళిని తల్లిదండ్రులు అన్నారు.












Click it and Unblock the Notifications
