ఇస్లామాబాద్: పాకిస్ధాన్ నూతన అధ్యక్షుడుగా అసీఫ్ అలీ జర్ధారీ ఈ రోజు (శనివారం) జరిగిన ఎలక్షన్ లో ఎన్నికయ్యారు. ఆయన పాకిస్ధాన్ పీపుల్స్ అభ్యర్దిగా దివంగత బెనజీర్ భుట్టో భర్త గా పోటీలో నిలిచారు. మొత్తం 436 ఓట్లుకు గాను ఆయన 281 ఓట్లు సంపాదించారు. గత నెలలో పర్వేజ్ ముషారఫ్ అధ్యక్ష్య పదవికి రాజీనామా చేయటంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఆ పాక్ అధ్యక్ష్య పదవికి ఓటింగ్ జరిగింది. పార్లమెంట్,నాలుగు రాష్ట్రాలు అసెంబ్లీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఇక పోటీలో జర్ధారీ మాత్రమే కాక ముషారఫ్ మద్దతుతో పీఎంఎల్ క్యూ పార్టీ తరపున ముషాహిద్ హుస్సేన్ సయ్యద్,నవాజ్ షరీఫ్ మధ్దతుతో మాజీ జడ్జి సయ్యద్ జుమాన్ సిద్దిఖీ రంగంలో ఉన్నారు. వారు 111,34 ఓట్లు మాత్రమే సంపాదించగల్గారు. ఇక గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా జర్ధారీ విజయం సాధించటం జరిగింది.