హైతీ మృతులు 500 పై మాటే...
హైతీ: హైతీలో హన్నా తుఫానుతో మృతిచెందిన వారి సంఖ్య 500 దాటింది. వరదలతో మరణించిన వారి సంఖ్య గొనైవ్స్ పట్టణ ప్రాంతాల్లోనే 495 వరకూ ఉందని అధికారులు తెలిపారు. తుఫానుతో 600,00 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఐక్యరాజ్యసమితి సహాయక కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ తుఫాన్ ప్రస్తుతం కైసియోస్ ద్వీపాల సమీపంలో ఉంది. ఇది మరింత బలపడి అమెరికా వైపు సాగుతోంది. అయితే ఇది హరికేన్ గా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications
