ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి: ఇలా చేస్తే అద్భుతః!

ఏదైనా కారంగా, పుల్లగా , టేస్టీగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో కొద్ది సేపులో తయారు చేసుకుని, నెలల తరబడి నిల్వ ఉంచుకునే టమాటా ఇన్ స్టంట్ నిల్వ పచ్చడి తినటానికి చాలా బాగుంటుంది. సాంప్రదాయకంగా ఎండబెట్టి చేసే టమాటా ముక్కల పచ్చడి కన్నా ఇది చాలా ఈజీగా, త్వరగా రెడీ అవుతుంది. రుచి మాత్రం అవకాయ స్టైల్‌లో పుల్లగా, కారంగా, సువాసనగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు

టమాటాలు - 1 కిలో
చింతపండు - 150గ్రాములు
కారం- 150 గ్రాములు
ఉప్పు - 200 గ్రాములు
పసుపు - 1 స్పూన్
ఆవాలు,మెంతుల పొడి - 2 టేబుల్ స్పూన్
వెల్లుల్లి - 70 గ్రాములు
ఆవాలు - 2 టేబుల్ స్పూన్స్
నూనె - 400 గ్రాములు
పోపు గింజలు - 4 టేబుల్ స్పూన్స్
కరివేపాకు - నాలుగు రెమ్మలు
ఎండుమిర్చి - 10

Instant Tomato Nilva Pachadi Know how to make delicious perfect Instant Tomato Nilva Pachadi at home

తయారీ విధానం:

ఒక కిలో దోరగా పండిన టమాటాలు తీసుకోండి. టమాటాలు కాస్త గట్టిగానే ఉండాలి. టమాటాలను బాగా కడిగి, పొడిగుడ్డతో తుడిచి, పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టండి. ఇది చాలా ముఖ్యం. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. 150గ్రాముల చింతపండు, టమాటాలను ఒక పాన్ లో 100గ్రాముల నూనె వేసి మగ్గించండి. టమాటా చింతపండు గుజ్జు బాగా దగ్గరకు వచ్చే దాకా మగ్గించండి.

అప్పటికప్పుడు తయారు చేసే టమాటా పచ్చడి ఇలానే చెయ్యాలి

మెంతులు, ఆవాలను వేర్వేరుగా లైట్‌గా వేపి, చల్లారిన తర్వాత పొడి చేసుకోండి.చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆపై చల్లారిన టమాటా, చింతపండు గుజ్జు, వెల్లుల్లి కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోండి. ఇప్పుడు ఒక పెనంలో వేరు శనగ నూనె 300 గ్రాములు బాగా వేడి చేసి తాలింపు వేయండి.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 - ఇంట్లోనే క్రిస్పీగా, స్పైసీగా ఇలా చెయ్యండి!
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 - ఇంట్లోనే క్రిస్పీగా, స్పైసీగా ఇలా చెయ్యండి!

సూపర్ రుచిగా ఇన్ స్టంట్ టమాటా పచ్చడి

ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించండి. ఇంగువ కూడా కొద్దిగా వేయవచ్చు. తాలింపు సువాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.గ్రైండ్ చేసిన టమాటా మిశ్రమంలో మనం కొలతల ప్రకారం తీసుకున్న కారం, ఉప్పు, పసుపు, మెంతి-ఆవాల పొడి అన్నీ కలిపి, అందులో తాలింపు పోసి పొడి, శుభ్రమైన గాజు సీసాలో పెడితే 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా చేస్తే ఇన్ స్టంట్ టమాటా పచ్చడి సూపర్ రుచిగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+