హైస్కూళ్ళల్లోనూ ర్యాగింగ్ భూతం
విజయనగరం: కాలేజీలకే పరిమతమనుకున్న ర్యాగింగ్ విష సంస్కృతి ఇప్పుడు హై స్కూళ్ళకూ పాకుతోంది. తాజాగా విజయనగరంలో జరిగిన ఓ సంఘటన అక్కడ అలజడి సృస్టిచింది. ఏడో తరగతి చదువుతున్న బాలికను ర్యాగింగ్ చేసాడంటూ ఒక బాలుడ్ని కిడ్నాప్ చేయబోయిన ఇద్దరు స్ధానికి చావు దెబ్బలు తిన్నారు. సెయింట్ జోసెఫ్ ఇగ్లీష్ మీడియం హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలు అదే స్కూల్లో సెవెన్త్ క్లాస్ చదువుతున్న సైనాని ర్యాగింగ్ చేసి ఏడ్పించాడు. ఇది తెలుసుకున్న ఆమె సోదరుడు ఇంద్రమౌళి ఆగ్రహంతో రగిలి తన స్నేహితుడు స్వరూప్ సాయింతో ప్లాన్ చేసాడు. బాలు స్నేహితులకు నాలుగు తగిలించి అతన్ని తీసుకురమ్మని బెదిరించారు. ఇంటి నుండి బయిటకు వచ్చిన బాలుని టు వీలర్ పై పాలనగర్ శ్మశాన వాటిక వైపు తీసుకెళ్ళారు. అక్కడ అతన్ని కొడుతూండటాన్ని చూసిన స్ధానికులు వారిని అడ్డగించారు. ఈలోగా విషయం తెల్సుకున్న బాలు బంధువులు స్ధానికులతో కలసి ఆ ఇద్దరిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
