అల్పపీడనం: కోస్తాలో భారీ వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు పడతాయి. దీని ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. రుతు పవనాలు వేగంగా కదలడం వల్ల, అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి.
వచ్చే 24 గంటల్లో కోస్తాలో అనేక చోట్ల వర్షాలు పడతాయి. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయి. ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు రోజుల పాటు ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
