శంషాబాద్ దొంగల ఊహా చిత్రాలు విడుదల
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న జరిగిన 1.11 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ కేసులో నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు సోమవారం సాయింత్రం విడుదల చేసారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని మధురై ఎక్స్ ప్రెస్ సర్వీసుకు తరుచూ ముంబై నుంచి విమానాల్లో పార్శిల్స్ వస్తూంటాయి. కొరియర్ సిబ్బంది శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో విభాగం నుండి పార్సెల్స్ తీసుకొస్తారు. ఆదివారి ఎప్పటిలాగే ఉదయం ముంబై నుంచి ఓ పార్సెల్ వచ్చింది. అందులో 1.11 కోట్ల విలువ చేసే బంగారం నగలు నాలుగు పెట్టెల్లో ఉన్నాయి.
వాటిని తీసుకునేందుకు మొత్తం ఏడుగురు సిబ్బంది ఓ మారుతీ వ్యానును,మరో శాంత్రో లలో కార్గో విభాగానికి వెళ్ళారు. వ్యానును కొద్ది దూరంలో ఆపి శాంత్రోను లోపలకి తీసుకెళ్ళారు. లోనికి వెళ్ళిన వారిలో మేనేజర్ హరిరాం తో పాటు మదన్ సింగ్,మిశ్రా,లలిత్ ఉన్నారు. ఉదయం 9.10 గంటలకు వెళ్ళిన వీరు 40 నిముషాల్లో పనలు పూర్తి చేసుకుని 9.50 కి బయిటకు వచ్చి వ్యాను వద్ద ఆగారు. ఆ తరువాత నగల పెట్టెలను పెట్టెలలో సర్ధుతుండగా సుమారు పాతికేళ్ళ వయిసున్న ఇద్దరు యువకులు అక్కడికచోచి చంపుతామని కత్తితో బెదిరించి నగలు బాక్సులున్న శాంత్రో కారు తీసుకుపారిపోయారు.












Click it and Unblock the Notifications
