హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందలకు పైగా స్ధానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేసారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగు దేశం పార్టీకే నష్టమని కాంగ్రేస్ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని ఆయన అన్నారు. 230 అసెంబ్లీ స్ధానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆయన ఎన్.టివి-నీల్సన్ చేసిన సర్వే వివరాలను వెల్లడించారు. ఎన్.టివీ లో అధ్యధిక వాటా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి షబ్బీర్ అలీకి ఉంది. సర్వే వివరాలను వెల్లడించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సర్వే ఫలితాలను దృష్టితో పెట్టుకుని అతి విశ్వాసంతో వ్యవహించవద్దని మంత్రులకు సూచించారు.