హైదరాబాద్: విమానం కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ సనత్ నగర్ లో ఒక శిక్షణ విమానం కూలిపోయి ఇద్దరు మరణించారు. ఈ శిక్షణ విమానం బేగంపేట నుంచి బయలుదేరింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ శ్రీనివాస్, కెప్టెన్ నిరంజన్ మరణించారు. సనత్ నగర్ ఫతేనగర్ బ్రిడ్జి వద్ద ఈ విమానం కూలిపోవడంతో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోగా మరో ఇంటి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విమానం ఎపి ఫ్లైయింగ్ క్లబ్ కు చెందినది. ఈ ప్రమాదం హైటెన్షన్ వైర్ తాకడంతో సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సంబంధిత డిసిపి విచారణ చేపట్టారు. ఇటీవల ఫ్లైయింగ్ విమానాలు కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications
