హైదరాబాద్: భూస్వాముల కొమ్ము కాసిన నిజాం నవాబును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కీర్తించడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. నిజాంను కీర్తించడమంటే రైతులను, పోరాట యోధుల్ని అవమానించడమేనని ఆయన అన్నారు. నిజాం నిరంకుశుడని, ఫ్యూడల్ వ్యక్తి అని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బిజెపికి ఎప్పుడూ మతం యావనే అని ఆయన అని ఆయన విమర్శించారు. మతతత్వాన్ని రగిలించడం, మత విశ్లేషణ చేయడం బిజెపికి అలవాటు అని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.