అహ్మదాబాద్: టాటా మోటార్స్ నానో కార్ల ప్రాజెక్టు గుజరాత్‌కు తరలివెళ్లటం దాదాపు ఖాయమైంది. టాటాల ఛైర్మన్ రతన్‌టాటా, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈమేరకు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. బెంగాల్‌నుంచి తమ ప్లాంటును ఉపసంహరించుకుంటున్నట్లు టాటాలు ప్రకటించగానే పలు రాష్ట్రాలు వారిన ఆహ్వానించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో స్థలాల పరిశీలన కూడా జరిగింది. చివరకు గుజరాత్ ప్రభుత్వం 1400 ఎకరాలు ఇస్తామనటం ఇవికాక అనేక పన్ను రాయతీలు ప్రకటించటంతో టాటాలు చివరకు గుజరాత్‌కే మొగ్గు చూపారని తెలుస్తోంది.