రాష్ట్ర మహిళా కాంగ్రేస్ విభాగానికి జీవిత రాజశేఖర్ అధ్యక్ష్యురాలిగా ఎంపికవుతుందన్న ప్రచారానికి తెరపడింది. ఆ పదవిలో గంగాభవానీనే కొనసాగించాలని అధిష్టానం వర్గం నిర్ణయించింది. మహిళా కాంగ్రేస్ కు కొత్త అద్యక్షురాలి నియామకంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డికి,పి సిసి అద్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కు మద్య విబేధాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక వైయస్ కొత్త అధ్యక్షురాలిగా సినీ నటి జీవిత ను నియమించాలని పట్టు పట్టగా,ఉప్పల శారదని నియమించాలని పిసిసి అధ్యక్షుడు పట్టుపట్టారు. వీరిద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోవటంతో మద్యే మార్గంగా ప్రస్తుతం ఉన్న అద్యక్షురాలు అయిన గంగా భవానీనే కొనసాగించాలని అదిష్టానం ఆదేశించింది. పిసిసికి కొత్త కార్యవర్గం ఏర్పాటుతో పాటు మహిళా కాంగ్రేస్ అధ్యక్షురాలి నియామకంపై కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతోంది.