జనం కోసమే పార్టీ పెట్టాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan
హైదరాబాద్‌: ఇప్పటివరకు ప్రజారాజ్యం పార్టీ లో తెరవెనుక కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారిగా వచ్చాడు. గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భరత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈరోజు ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించి పలుచోట్ల ప్రసంగించారు. తర్వాత ఆయన ఫ్యాన్స్ తో సంభాషించారు. పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చిరంజీవి ఆశయాలను తెలియజెప్పాలని వారికి పిలుపిచ్చారు. కూకట్ పల్లి, శేరిలింగం పల్లిలలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, జెండా పండుగ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. ఇప్పుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజారాజ్యాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేసారు. జనంమీద బతికే నాయకులున్న ఈ రోజుల్లో జనంకోసమే అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టారని అన్నారు. అలాగే యువత అండదండలతో అన్ని ప్రజాసమస్యలను ప్రజారాజ్యం పార్టీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

పేదల కష్టాలను రూపుమాపేందుకే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి నెలకొల్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే ప్రజారాజ్యం కార్యకర్తల్లో నూతన ఉత్యాహం వచ్చింది. అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూసేంతవరకు తాము విశ్రమించమని వారు ధీమాగా చెపుతున్నారు. ఇప్పటివరకు జంటనగరాల్లో స్తబ్దుగా ఉన్న పీఆర్పీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+