యు.ఎన్.సెక్రటరీ భారత్ పర్యటన
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్-కి-మూన్ నవంబర్ లో భారత్ రానున్నారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉందని ఐరాస అధికార ప్రతినిధి మేఖేల్ మోంటాస్ తెలిపారు. అలాగే ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈనెల 27నుంచి 30 వరకు ఆయన మనీలాలో ఓ సదస్సులో పాల్గొంటారనితెలిపారు. ఆ సదస్సు మైగ్రేషన్ సమస్యలపై ఉంటుందని అన్నారు. అనంతరం భారత్, బంగ్లాదేశ్‌లలో పర్యటిస్తారని ఆమె తెలిపారు. త్వరలోనే ఆయన పర్యటన ప్రదేశాలు,తేదీలు అధికారికంగా తెలియపరచటం జరుగుతుందని ఆమె తెలియచేసారు.












Click it and Unblock the Notifications
