ఢిల్లీలో ఫ్లై ఓవర్ కూలి ఇద్దరు మృతి

న్యూఢిల్లీ : నగరంలోని షకార్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్త్లెఓవర్‌ కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ సారథ్యంలో నిర్మిస్తున్న ఫ్త్లెఓవర్‌ కూలిపోయి బస్సుపైన పడింది. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 28 ఏళ్ల బస్సు డ్రైవర్‌ తో పాటు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 17 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిని వాలియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో 400 టన్నుల కాంక్రీట్ స్పాన్ ను క్రేన్ సాయంతో ఎత్తుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపాల వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఫ్లై ఓవర్ కూలి బ్లూలైన్ బస్సుపై పడింది. దీంతో సురేందర్ కుమార్ అనే బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.

సంఘటనలో రెండు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో వికాస్ మార్గ్ లో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇది తమకు పెద్ద షాక్ అని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ సంఘటనపై స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని ఢిల్లీ మెట్రో అధికార ప్రతినిధి అనజ్ దయాళ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సందర్శించారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని ఆమె చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పునసాయం చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+