దేవేందర్ తో దోస్తీకి కాంగ్రెస్ యత్నం

వచ్చే ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ తో స్నేహం కుదుర్చుకోవడానికి వీలుగా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయనకు సోనియా అపాయింట్ మెంట్ ఇప్పించడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ రేపో మాపో సోనియాతో భేటీ కావచ్చునని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయనే భావనతో మరో తెలంగాణ పార్టీ ఎన్టీపిపిని తమతో పాటు తీసుకుని పోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications