ఇప్పుడే ఇక్కడే రాజీనామా చేస్తా: సోమనాథ్

Somnath Chatterjee
న్యూఢిల్లీ: సిపిఎం సభ్యుల తీరుకు తీవ్రంగా ప్రతిస్పందించిన లోకసభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ స్పీకర్ పదవిని అవమానించిందకు ఇప్పుడే ఇక్కడే రాజీనామా చేస్తానని శుక్రవారం సభలో అన్నారు. తన నిర్ణయాలను పదే పదే ప్రశ్నించడంపై ఆయన విసుగు చెందారు. వాయిదా తీర్మానం మేరకు ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చెలరేగిన హింసపై చర్చకు అనుమతించాలని సిపిఎం సభ్యుడు బసుదేవ్ ఆచార్య డిమాండ్ చేశారు. తాను వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినప్పటికీ బసుదేవ్ ఆచార్య చర్చకు పట్టుబట్టడంపై సోమనాధ్ ఛటర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా బసుదేవ్ ఆచార్య చర్చకు పట్టుబడుతూ వస్తున్నారు.

తాను ఇచ్చిన వాయిదా తీర్మానంపై ఎందుకు చర్చకు అనుమతించరని ఆచార్య అన్నారు. దానికి ఆగ్రహించిన స్పీకర్ మీరు లేవనెత్తినదానిపై వినడానికి ప్రయత్నించానని, గతాన్ని మర్చిపోవాలని, లేవనెత్తడానికి తన వద్ద కూడా సమస్యలున్నాయని, తనను ఇప్పటికే చాలా రెచ్చగొట్టారని, అయినా మౌనంగా ఉన్నానని అన్నారు. స్పీకర్ రూలింగును కూడా ప్రశ్నించే కొత్త సంస్కృతిని తెస్తున్నారని సోమనాధ్ అన్నారు. చర్చ విషయంలో జాప్యం చేయడంపై వామపక్ష సభ్యులు స్పీకర్ మీద విమర్శలు చేశారు. కావాలని వామపక్ష సభ్యులు తన అధికారాన్ని సవాల్ చేస్తున్నారని సోమనాథ్ ఛటర్జీ అన్నారు. రోజుల తరబడి స్పీకరును సవాల్ చేస్తున్నారని ఆయన అన్నారు. సభాధ్యక్ష స్థానాన్ని అవమానపరచవద్దని, అది సభకే అవమానమని, తాను ఈ కుర్చీలోంచి తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+