వేట్లపాలెం పేలుడులో ముగ్గురు మృతి
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా వేట్లపాలెం గ్రామంలో మందుగుండు సామగ్రి పేలిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పదిమందిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో పది మంది పనిచేస్తారు. కానీ దీపావళి పర్వదినం సమీపించడంతో 20 మంది దాకా పనిచేస్తున్నారు. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లనే ప్రమాదం సంభవించిందని స్థానికులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
