ప్రజారాజ్యానికి అర్థం కాలేదు: బిజెపి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోవడానికి ఇదే చివరి అవకాశమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే తాము కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతోమాట్లాడుతామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై వీరప్ప మొయిలీ చెప్తే సరిపోదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఎన్నికల లోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై వెంటనే వివిధ పార్టీల నుంచి ప్రతిస్పందనలు వచ్చాయి.












Click it and Unblock the Notifications
