బాబుకున్న ఓపిక లేదా?: పొత్తులపై బర్దన్

తాము మొదటి నుంచి వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. వామపక్షాలతో తాము ఇప్పటికే కలిసి పనిచేస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. పొత్తుల విషయంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మతవిధానాలను తాము వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు తాము పాత మిత్రుడని, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది కీలకమైన పాత్ర అని బర్దన్ అన్నారు. చిరంజీవి, చంద్రబాబుల్లో మీకు దగ్గరి మిత్రుడెవరని విలేకరులు అడిగితే తనకు అత్యంత సన్నిహిత మిత్రురాలు తన భార్య బర్దన్ జవాబిచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో బుధవారం ఉదయం సిపిఐ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సిపిఐ నేతలను ఆయన అల్పాహార విందుకు హాజరయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాదు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్ధన్ తో పాటు రాజా, సురవరం సుధాకర్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు చంద్రబాబు ఇంటికి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుకోవాల్సిన పొత్తులపై చర్చించడానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశమవుతోంది.
చంద్రబాబు నివాసానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మాత్రం రాలేదు. ఆయన గైర్హాజరీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడానికి నారాయణ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా నారాయణ చంద్రబాబు నివాసానికి రాలేకపోయారని సిపిఐ నాయకులు చెప్పారు .












Click it and Unblock the Notifications
