ఆంధ్రప్రదేశ్ బోర్డుల తొలగింపు ఉద్యమం
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బోర్టులను తొలగించి తెలంగాణ స్ట్రిక్కర్లు అతికించే ఉద్యమాన్ని నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) కార్యకర్తలు ప్రారంభించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్టీపి కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ బోర్టులను తొలగించి, తెలంగాణ స్టిక్కర్లను అతికిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొంటున్నాయి. వాహనాలకు కూడా ఎపి అనే అక్షరాలను తొలగించి టిజి అనే అక్షరాల స్టిక్కర్లను అతికిస్తున్నారు.
సంగారెడ్డిలోని మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ కార్యాయాల బోర్డులపై ఆంధ్రప్రదేశ్ ను తొలగించి తెలంగాణ అనే స్టిక్కర్లను అతికించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.












Click it and Unblock the Notifications