వరంగల్ విమాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!

వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు కీలక దశకు చేరుకుంటున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మామునూరు ఎయిర్ పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందని సూచన చేయాలని ప్రజలను కోరారు. దీంతో ప్రజల నుంచి ముఖ్యంగా ఓరుగల్లు వాసులు అనేక పేర్లతో సూచనలు చేస్తున్నారు.

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి చాలా మంది రాణి రుద్రమదేవి పేరుతో ఎయిర్‌పోర్ట్ పెట్టాలని సూచిస్తున్నారు. వరంగల్‌కు చెందిన భద్రకాళి అమ్మవారి పేరుతో 'భద్రకాళి విమానాశ్రయం' అని కోరేవారు కూడా ఎక్కువే ఉన్నారు. కాకతీయ రాజుల పాలనను గుర్తు చేసేలా 'కాకతీయ ఎయిర్‌పోర్ట్' అనే పేరు కూడా బాగుంటుందని చెప్తున్న వారు లేకపోలేదు.

warangal airport This is the name suggested by majority people to cm revanth for Warangal airport

ఏకశిల, ప్రతాపరుద్ర, సమ్మక్క-సారలమ్మ, జయశంకర్, కాళోజీ నారాయణరావు, చాకలి ఐలమ్మ వంటి పేర్లు కూడా పలువురు సూచన చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని రెండు పేర్లు సూచించారు. వరంగల్ దర్శకుడు ప్రభాకర్ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 'బతుకమ్మ విమానాశ్రయం' అనే పేరు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

కొందరు విమానాశ్రయం లోగో నమూనాలను కూడా రూపొందించి పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లలో మెజారిటీ ప్రజలు రాణి రుద్రమదేవి పేరును సూచించటం కనిపిస్తుంది. ఇది వరంగల్ చరిత్ర, సంస్కృతి, స్థానిక గుర్తింపును, కాకతీయుల వీరత్వాన్ని ప్రతిబింబించేలా పేరు పెట్టాలనే స్థానికుల ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ తర్వాత స్థానంలో కాకతీయ నిలిచింది.

ఇదిలా ఉంటే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న చర్యలలో మూడు ప్యాకేజీలుగా నిర్మాణ పనులను చేపట్టడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా టెండర్లు పిలిచి ప్రక్రియను పూర్తి చేసింది. విమానాశ్రయ నిర్మాణాలు జరిగే ప్రాంగణం 953 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణం తొలి ప్యాకేజీలో చేపట్టనున్నారు.

రైతులకు కీలక అలెర్ట్... ఈ నెల 30వ తేదీలోపు ఆ పని చేయకుంటే సంక్షేమపథకాలు కట్!
రైతులకు కీలక అలెర్ట్... ఈ నెల 30వ తేదీలోపు ఆ పని చేయకుంటే సంక్షేమపథకాలు కట్!

రన్ వే, ఆవరణలో పార్కింగ్, సీవరేజ్ వ్యవస్థ నిర్మాణ పనులను రెండవ ప్యాకేజీలో ప్రతిపాదించారు. ఇక ఆఖరి ప్యాకేజీ పనులను టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలను 213. 59 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి తాజాగా టెండర్లు పిలిచి నవంబర్ నాటికి పూర్తయ్యేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిసెంబర్లో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+