మనోహర్ వ్యాఖ్యలతో కేడర్ ఆగ్రహం వేళ పవన్ అనూహ్య నిర్ణయం..!!

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి - వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వైపులా స్థానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నాయి. కేడర్ కు కీలక దిశా నిర్దేశం చేసాయి. కూటమిలో సీట్ల పంపకాల పైన సమన్వయ కమిటీ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి సీట్ల పైన మంత్రి మనోహర్ చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియా వేదికగా జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పార్టీ చీఫ్ పవన్ రంగం లోకి దిగారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.

స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల పైన కూటమిలో మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన సమావేశాల్లో జనసేన నేతలు తమకు సీట్ల కేటాయింపు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నికల ఫార్ములా ఈ ఎన్నికల్లో పని చేయదని.. పార్టీకి బలం ఉన్న చోట పోటీ చేస్తామని చెబుతూ వచ్చారు. అయితే.. సీట్ల కేటాయింపు పైన మూడు పార్టీల అధి నేతలు నిర్ణయం తీసుకుంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.

janasena-chief-pawan-kalyan-likely-to-announce-key-decision-over-local-body-elections-in-kakinada-me

అయితే.. తాజాగా విశాఖ లో మంత్రి మనోహర్ జనసేనకు సీట్ల సంఖ్య పైన చేసిన వ్యాఖ్యల పై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. బలం ఉన్న చోటే పోటీ చేస్తే.. పొత్తు అవసరం ఏంటని ప్రశ్నించారు. 2024 ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కేడర్ కు అవకాశం కల్పించేలా ఎక్కువ సీట్లు దక్కించుకునేలా నిర్ణయాలు ఉండాలని సూచిస్తున్నారు.

 పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఫిక్స్..!!
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఫిక్స్..!!

స్థానిక ఎన్నికల పైన పవన్ కీలక సమావేశం

కాగా, ఇదే సమయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే మున్సిపల్, పంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా కందుల దుర్గేష్‌ను నియమించారు. రెండు రోజుల పిఠాపురం పర్యటన కోసం పవన్ రాజమండ్రి చేరుకున్నారు. ఈ నెల 22న కాకినాడ వేదికగా రాష్ట్ర స్థాయి కీలక సమావేశాన్ని పవన్ ఏర్పాటు చేసారు. కేరళలో చికిత్స తీసుకున్న తరువాత పవన్ ఈ సమావేశం ద్వారా పార్టీ వ్యవహా రాల పైన తిరిగి ఫోకస్ చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు.. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయను న్నారు. ప్రధానంగా నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, ఎన్నికలకు అవసరమైన సన్నద్ధతపై చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా సీట్ల సంఖ్య పైన పార్టీ కేడర్ లో చర్చ జరుగుతున్న వేళ తన నిర్ణయం ఏంటో పవన్ వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో.. పవన్ చేసే ప్రకటన పైన కూటమిలో ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+