AP Rain Alert: దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం- 24 గంటల్లో అతి భారీ వర్షాలు....!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలోపేతం కానుందని అధికారులు వెల్లడించారు. ఇది ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!

అల్పపీడనం నుంచి వాయుగుండానికి మారుతున్న ప్రభావంతో నేడు, రేపు చెదురుమదురుగా భారీ వర్షాలు (AP Rain Alert) ఉంటాయని ఆయన తెలిపారు. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు ఉంటాయన్నారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే కోస్తా తీరం వెంబడి 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొన్నారు.

IMD Sounds Rain Alert for AP as Bay of Bengal System Set to Intensify Into Cyclonic Storm
AP Rain Alert: రేపూ, ఎల్లుండీ వర్షాలే..! ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్..!
AP Rain Alert: రేపూ, ఎల్లుండీ వర్షాలే..! ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్..!

వాయుగుండం పరిస్ధితుల నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. అలాగే సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని,
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తీర ప్రాంతాల్లో అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది. వర్షాల ప్రభావం నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+