లక్ష కోట్లుతో శ్రీలంక రక్షణ
కొలంబో : ఎల్టీటిఇ నుంచి ఎదుర్కొంటున్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకున్న శ్రీలంక ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌ను రెట్టింపు చేసింది.ఎన్నడూ లేని విధంగా ఆ రక్షణ బడ్జెట్ రూ. లక్ష కోట్లకు చేరుకుంది. ఇంతవరకూ ఏ ఆసియా దేశం కూడా రక్షణ బడ్జెట్‌ను ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పెంచడం జరగలేదని రక్షణ రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు వివరిస్తున్నారు.
2009 సంవత్సరానికి గానూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన రక్షణ బడ్జెట్‌లో సైనికులకు జీత భత్యాలను భారీగా పెంచారు. అదే విధంగా అధునాతన ఆయుధాల కొనుగోలుకు భారీ మొత్తాలే కేటాయించారు. ఇవి కాకుండా సైన్యంలో చేరే యువతకు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications