సిబిఐ విచారణకు అభ్యంతరం లేదు: జానా
హైదరాబాద్ : పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడు మొద్దు శీను హత్య కేసును సిబిఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధికే ప్రభుత్వం పాత్ర ఉందనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. మొద్దు శీను హత్యతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. జైళ్ల శాఖ డిఐజితో, శాంతిభద్రతల ఉన్నతాధికారితో విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
అనంతపురం కారాగారంలో హత్యకు గురైన మొద్దు శీను హత్యపై విచారణ జరిపిస్తామని జానారెడ్డి తెలిపారు. దీనిపై ఐజీ స్థాయి అధికారి విచారణ జరుపుతారని ఆయన వెల్లడించారు. హంతకుడు ఓంప్రకాశ్ ఏదేనీ రాజకీయపక్షంతో సంబంధాలున్నాయన్న అంశంపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications
