శీను హత్యతో సంబంధం లేదు: జెసి
విజయవాడ: మొద్దు శీను హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మొద్దు శీను హత్యతో తనకు సంబంధం ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. తనపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు ఆనవాయితీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై అనుమానం ఉంటే ఏ విచారణనైనా జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు.
అనుమానాలు ఉంటే తన ప్రమేయంపై విచారణ జరిపించడంలో తప్పు లేదని ఆయన అన్నారు. మొద్దు శీను హత్య జరిగినట్లు ఎవరో చెప్తే తనకు తెలిసిందని ఆయన అన్నారు. అంతకు మించి తనకు ఏ విధమైన వివరాలు తెలియవని ఆయన అన్నారు. తమ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్లు తాను చవితి చంద్రుడిని చూసి ఉంటానని, అందుకే తనపై ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
