సూరితో విభేదాలే కారణమా?
హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను మద్దలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరికి సన్నిహితుడు. పరిటాల రవికి, సూరికి మధ్య ఫ్యాక్షన్ కక్షల నేపధ్యంలో మొద్దు శీను సూరి కోసం పరిటాల రవిని హత్య చేసినట్టు ఆనాడు వార్తలు వచ్చాయి.
మొద్దు శీనుకు ఇస్తానన్న డబ్బును సూరి పూర్తికి ఇవ్వనందువల్లనే శీను అప్రూవర్ గా మారాడని ఆరోపణలు ఉన్నాయి. అప్రూవర్ గా మారినందువల్ల మొద్దు శీనుకు పాల వర్గాల నుంచి ప్రాణ భయం ఉండవచ్చని కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలు రెండు నెలలుగా అంటున్నాయి.
కానీ పరిటాల రవి హత్యను కాంగ్రెస్ ప్రభుత్వమే పోలీసుల ద్వారా చేయించిందని తెలుగుదేశం నాయకుల ఆరోపణ. పెద్ద కుట్రలో మొద్దు శీను చిన్న పావు మాత్రమేనని వారి వాదన. ముఖ్యమంత్రి వైఎస్ కు, అనంతపురం జి ల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జెసి దివాకరరెడ్డిలకు మద్దలచెరువు సూరి సన్నిహితుడు. సూరి ద్వారా పరిటాల హత్యను పోలీసుల సహకారంతో జరిపించారని ఆరోపణ.












Click it and Unblock the Notifications
