చిరుతో బహిరంగ చర్చకు రెడీ: పొన్నాల
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందంటూ చిరంజీవి చేసిన ఆరోపణలపై నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై తాము చిరంజీవితో చర్చకు సిద్ధమని చెప్పారు. ఈ మేరకు చిరంజీవికి ఆదివారంనాడు పన్నెండు పేజీల ఓ లేఖ రాశారు. దాన్ని మీడియా ముందే చిరంజీవికి పంపారు. రాజకీయాలకు కొత్త అయిన చిరంజీవి అన్ని అంశాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పొన్నాల అన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందంటూ గతంలో ఎన్నోమార్లు ఆరోపించిన ప్రతిపక్షాలతో తాము భేటీ అయ్యామనీ, వారెవ్వరూ అవినీతిని నిరూపించలేకపోయారని పొన్నాల అన్నారు. చిరుతో బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
