శీను హత్య ప్రభుత్వ పెద్దలదే: సునీత
అనంతపురం : పరిటాల రవి హత్య కేసులో ఆధారాలు బయటపడుతాయనే భయంతోనే మొద్దు శీనును ప్రభుత్వంలోని పెద్దలే హత్య చేయించారని దివంగత శాసనసభ్యుడు పరిటాల రవి సతీమణి , తెలుగుదేశం పెనుగొండ శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆరోపించారు. నిజాలు తేలాలంటే న్యాయవిచారణ జరిపించాలని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధలు సమావేశంలో డిమాండ్ చేశారు.
పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దుశీను హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులు కాలువ శ్రీనివాసులు, పల్లెరఘునాధరెడ్డి విడిగా మీడియా ప్రతినిధలు సమావేశంలో ఆరోపించారు. రవి హత్యకేసు ముగింపుకు వస్తున్న సమయంలో హత్య జరగడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. మొద్దుశీను వాస్తవాలు చెబితే ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు బయటపడుతారన్న భయంతోనే ఈ హత్య చేయించారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications
