శీను హత్యపై ఏ విచారణకైనా సిద్ధం: వైయస్
హైదరాబాద్: మొద్దు శీను హత్యపై తాము ఏ విచారణకైనా సిద్ధమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ విచారణను కోరితే ఆ విచారణను జరిపిస్తమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మొద్దు శీను హత్యతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అలా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మొద్దు శీను హత్యతో ప్రభుత్వానికి సంబంధం ఉందని చంద్రబాబు చేసిన ఆరోపణపై తీవ్రంగా ప్రతిస్పందించారు.
ప్రభుత్వానికి మొద్దు శీను హత్యతో సంబంధం ఉందనే ఆరోపణలు చంద్రబాబు దిగుజారుడు తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. మొద్దు శీను హత్య జైల్లో జరిగిన దుర్ఘటన మాత్రమేనని ఆయన అన్నారు. మొద్దు శీను హత్యను ప్రభుత్వానికి అంటగట్టడం దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
