అహ్మదాబాద్ పేలుళ్లు: కుట్రదారు అరెస్టు
అహ్మదాబాద్: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక కుట్రదారుడు ఖయాముద్దీన్ కపాడియాను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖయాముద్దీన్ కపాడియాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని, అంతకు మించి వివరాలు తనకు తెలియవని అహ్మదాబాద్ నేరవిభాగం జాయింట్ పోలీసు కమీషనర్ ఆశిష్ భాటియా చెప్పారు. వడదొరాకు చెందిన ఖయాముద్దీన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గతంలో ప్రకటించారు.
ఖయాముద్దీన్ అహ్మదాబాద్ లో సైకిల్ బాంబులు పెట్టినట్లు, సూరత్ లో కూడా బాంబులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. బాంబులు పెట్టిన నాలుగు సైకిళ్లను కూడా అతను కొన్నట్లు పోలీసులు కనిపెట్టారు. సిమి నాయకుడు సఫ్దర్ నాగోరీని అరెస్టు చేసిన తర్వాత ఖయాముద్దీన్ కోసం పోలీసులు వడదొరా వెళ్లారు. అయితే అక్కడి నుంచి అతను తప్పించుకున్నాడు. ఇతను రబ్బరు స్టాంపు వెండర్ గా అహ్మదాబాదులో మకాం పెట్టాడు.












Click it and Unblock the Notifications
