అది నాగార్జున ఇష్టం: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెస్ కు ప్రచారం చేయడం నాగార్జున వ్యక్తిగతమని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. స్నేహం ఉన్నంత మాత్రాన నాగార్జునను తాను నియంత్రించలేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నాగార్జున నిర్ణయాలపై, ఇష్టాలపై తాను స్పందించబోనని ఆయన అన్నారు.

తమపార్టీ స్థాపించి రెండున్నర నెలలే అయిందని, తెలంగాణపై ఇప్పటికే ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువ స్పష్టతే ఇచ్చామని ఆయన చెప్పారు. ఆయా తెలంగాణ పార్టీలు కూడా తమకు అభినందనలు తెలిపాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను తమపార్టీ మభ్యపెట్టబోదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఇదివరకు చెప్పినమాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు అవసరమైన శక్తి అని, వారి వాదన వినిపించడానికి అవసరమైన గొంతు ఇస్తే కేంద్రంపై ఒత్తిడితెస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తామంటే తమపార్టీ అడ్డుకోబోదని మరోసారి చెప్పారు. అయితే ఈ అంశంపై ఉద్యమం చేపట్టబోమన్నారు. తెరాస అధినేత కేసీఆర్‌ ఇటీవల ప్రజారాజ్యంపై చేసిన వ్యాఖ్యల మీద స్పందించాలని విలేకరులు అడగ్గా అది ఆయన సొంత అభిప్రాయమని, తమపార్టీ గురించి ప్రజలే చెబుతారన్నారు.

మొగల్తూరు వెళ్లి చాలా రోజులే అయింది 'అవును.. వూరుకు వెళ్లి చాలాకాలమైంది.. అక్కడ మా చుట్టాలెవరూ లేరు.. వారందరూ నేను చెన్నై వెళ్లినపుడు చెన్నైకి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు మారినపుడు ఇక్కడికీ వచ్చేశారు. బంధువులు లేకపోతేనేం.. నాకక్కడ ఆత్మబంధువులున్నారు. యావన్మందీ నాకు ఆత్మబంధువులే. వారే ఎక్కువ. స్నేహితులు ఒకరిద్దరున్నారు. వారు అప్పుడప్పుడూ వచ్చి కలుస్తుంటారు' అని ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లాలోని తన సొంతగ్రామం మొగల్తూరును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చిరంజీవి తన సొంతగ్రామానికి 30 ఏళ్లుగా వెళ్లలేదంటూ ముఖ్యమంత్రి కుమారుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా పైవిధంగా స్పందించారు. తనకు అక్కడివారు ఇప్పుడు కొత్తగా ఉంటారని, అయితే పుట్టిన భూమిపై మమకారం ఉందని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు

రాబోయే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించగా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులెవ్వరూ ఉండరని, ప్రజాభీష్టానికి అనుగుణంగా నడవాల్సి ఉంటుందని చిరంజీవి చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో తన పర్యటన ఈ నెల 14 నుంచి ఉంటుందని, అనంతపురం, కడపల్లో ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభించాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సోమవారం షెడ్యూలు ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. తన పర్యటనపై మొద్దుశీను హత్య ప్రభావం ఉండదన్నారు. ఆ హత్య శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+