చిరు స్పష్టంగా చెప్పాలి: కెసిఆర్

K Chandrasekhar Rao
తిరుపతి: తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నుంచి స్పష్టమైన వైఖరి కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. 2009 ఎన్నికల లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పూనుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మట్టి కరవడం ఖాయమని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడానికి తిరుమల వచ్చిన ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో తాము కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు.

రాయలసీమ ప్రజలు కోరుకుంటే ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం తాము నిలబడుతామని ఆయన చెప్పారు. అయితే రాష్ట్ర డిమాండుకు శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణకు అటువంటి ప్రాతిపదిక ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి రకరకాల రాష్ట్ర ఏర్పాట్ల డిమాండ్లు తేవడం సరైంది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+