రజనీకాంత్ తో అద్వానీ భేటీ

రజనీకాంత్ ఇంటికి సమీపంలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇల్లు ఉంది. అద్వానీ ఆమెతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని బిజెపి వర్గాలు కూడా భావించాయి. ఈ మేరకు ప్రచారం కూడా జరిగింది. అయితే రజనీకాంత్ ఇంటికి అద్వానీ వెళ్లి సంచలనం సృష్టించారు. అనంతరం రజనీకాంత్ నారదగాన సభలో జరిగిన అద్వానీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై కార్యక్రమం ముగిసేంత వరకు ఉన్నారు. కార్యక్రమం అనంతరం రజనీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ప్రచారం చేస్తున్నారా అని ప్రశ్నించగా 'లేదు' అని సమాధానమిచ్చారు.
అయితే అద్వానీ మాత్రం ఎప్పటి నుంచో తన ఇంటికి రావాల్సిందిగా రజనీకాంత్ కోరారని, దీంతో తాను ఈ రోజు వీలు చూసుకుని ఆయన ఇంటికి వెళ్లానని తెలిపారు. చాలాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నామన్నారు. తాను ఇటీవల నటించిన శివాజీ చిత్రం తాలూకు డీవీడీని రజనీకాంత్ బహుకరించారని తెలిపారు.












Click it and Unblock the Notifications