బాలయ్య బెస్ట్, బాబు వేస్ట్: మారెప్ప
ఒంగోలు: అవినీతిపై పోరాడేముందు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తన బావ నారా చంద్రబాబు నాయుడు అక్రమార్జనను ప్రశ్నించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప సూచించారు. యువగర్జన వేదికపై తొడలు కొట్టడం, అవినీతిని కంటిచూపుతో చంపేస్తానని వ్యాఖ్యానించడం భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గంటకు కోటి సంపాదిస్తున్నాడని విమర్శిస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు గంటకు ఎంత సంపాదించాడో ప్రజలకు వివరించాలని మారెప్ప డిమాండ్ చేశారు. బాలయ్య బెస్ట్, చంద్రబాబు వేస్ట్ అని యువగర్జన సదస్సులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తేల్చారని మారెప్ప అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి పథకాలను చూసే సినీ నటులు కాంగ్రెస్ వైపు వస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications