ఆయనే పెద్ద దళారీ: నారాయణ
ఒంగోలు : రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఓడరేవుల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. తాను అగ్రకులంలో పుట్టినా పేదల కోసం పని చేస్తున్నానను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన కులం వారిని మోసం చేస్తూ మోపిదేవి అగ్రకులాల వారికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూమలను ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తున్న మోపిదేవే పెద్ద దళారి అని నారాయణ వ్యాఖ్యానించారు.
తాను అగ్రకులంలో పుట్టి తన కులాన్ని మోసం చేసి పేదల కోసం పని చేస్తున్నానని, మోపిదేవి వెంకటరమణ అడుగంటిన వర్గంలో పుట్టి ఆ వర్గాన్ని మోసం చేసి సంపన్న వర్గాలకు సేవ చేస్తున్నారని, తమ ఇద్దరి మధ్య తేడా, సామీప్యత అదేనని ఆయన అన్నారు. మోపిదేవి వెంకటరమణ సొంత ఊళ్లో తాము ధర్నా చేశామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications