చిరుకు అధికారం కల్ల: వైయస్

చిరంజీవికి వ్యవసాయం గురించి తెలియదని, అటువంటి చిరంజీవి అధికారంలోకి వస్తే రాష్ట్రం దశాబ్దాలు వెనక్కి పోతుందని, అయితే చిరంజీవి అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది కాబట్టి ప్రాజెక్టులే నిర్మించకూడదని చిరంజీవి అనడం సరైంది కాదని, ఎలుక ఉందని గుడిసెను తగులబెట్టుకోలేం కదా, అలాగే అవినీతి ఉందని ప్రాజెక్టులు కట్టకూడదని అనడం సరైంది కాదని, అవినీతి లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications