రాజకీయం చేయవద్దు: వర్మ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తో కలిసి తాజ్ హోటల్ ను సందర్శించడం యాదృచ్ఛికమేనని దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. దాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ తో కలిసి తాను ఉగ్రవాదుల దాడికి గురైన తాజ్ హోటల్ ను సందర్శించడంపై వివాదం చెలరేగడంతో ఆయన సోమవారం వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రి తనను ఆహ్వానించలేదని, ముఖ్యమంత్రికి తనను పరిచయం కూడా చేయలేదని, ముఖ్యమంత్రి కుమారుడు రితేష్ తనకు బాగా తెలుసునని, రితేష్ పాటు తాను వెళ్లానని ఆయన అన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులపై సినిమా నిర్మించే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
