10 తర్వాత బాబుతో బాలయ్య భేటీ

అయితే హైకోర్టు రోడ్‌షోలపై స్టే విధించడంతో తన ప్రచార కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలనే విషయంపై ఆయన, చంద్రబాబులు చర్చ జరుపుతారని సమాచారం. హరికృష్ణ కూడా ఇందులో పాల్గొంటారు. బహిరంగ సభలు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభల రూపంలో ప్రచార కార్యక్రమం రూపొందించాలన్న ఆలోచనతో పార్టీ ఉంది. బాబు, బాలయ్య భేటీలో దీనికి తుదిరూపునివ్వనున్నారు. ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం లేదు. ఏప్రిల్ లోనే జరిగే అవకాశం ఉంది. అందువల్ల బాలయ్య తన ప్రచార కార్యక్రమాన్ని డిసెంబర్ మూడో వారంలో చేపట్టకపోవచ్చు. తన కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
