హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) మందకృష్ణకు మాదిగకు తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి మద్దతు తెలియజేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మందకృష్ణ మాదిగను ఆయన శుక్రవారం పరామర్శించారు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయ బలం కోసం ఎస్సీలను చీల్చడం సరి కాదని ఆయన అన్నారు. అన్నదమ్ములలాంటి మాలమాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చీలుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.