మంత్రులను తప్పించండి : నారాయణ
విజయవాడ : మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణ అవినీతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే పదవులనుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్దివుంటే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించివుండాల్సిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. కళంకిత మంత్రులు రాజీనామా చేసేంతవరకు మిత్రపక్షాలతో కలిసి ఆందోళన చేస్తామని నారాయణ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
