పొగ మంచులో డిల్లీ
న్యూఢిల్లీ: దేశరాజధాని పొగమంచులో కప్పబడింది. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తుండగా, విమానాల రాకపోకలు స్తంభించాయి. కనుచూపుమేరలో ఏం కనిపించనంత దట్టంగా పొగమంచు పేరుకుంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈరోజు ఉదయం బయలుదేరాల్సిన ఢిల్లీ-ముంబాయి, ఢిల్లీ-అమృత్‌సర్ విమానాలు రద్దయ్యాయి.
ఇప్పటికే ఢిల్లీలో రాత్రి ఉషోగ్రతలు 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోగా, జనవరిలో ఇవి మరింత కనిష్ట పడిపోయే అవకాశం ఉండవచ్చని వాతావరణ శాఖ చెబుతున్నది. చలి కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలడంతో ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టింది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతున్నది.












Click it and Unblock the Notifications